మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్

Spread the love

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్ లో రాష్ట్ర ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ శాసనసభ్యులు దానికి హాజరయ్యారు. వారంతా ఖేమ్ చంద్ ను  తమ నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు, మణిపుర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన 2017 నుంచి 2022 వరకు మణిపుర్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2022లో బీరెన్సింగ్ ప్రభుత్వంలో  మంత్రిగా నియమితులయ్యారు. 2023 మే నుండి మణిపూర్ అల్లర్లతో అట్టుడుకిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అక్కడ మొత్తం 60 శాసన సభ స్థానాలుండగా..2022లో బీజేపీ నుండి 32 మంది గెలిచారు. ఎన్.పి.పి , ఎన్.పి.ఎఫ్ కూడా ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.