అహంకారంతో  ప్రజల ఆస్తులపై జగన్ తన ఫోటో వేసుకున్నాడు:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.గత పాలకులను, ప్రభుత్వాన్ని నేను హెచ్చరించాను.. అయినా వారి అహంకారంతో ప్రజల ఆస్తులపై జగన్ తన ఫోటో వేసుకున్నాడని విమర్శించారు. ఇక రాయవరంలో కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు పట్టాదారుపాసు పుస్తకాన్ని స్వయంగా సీఎం అందించారు. అనంతరం పాసుపుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను సెల్ ఫోన్‌లో స్కాన్ చేయించి మ్యాప్ ద్వారా పొలం వద్దకు రైతు, అధికారులతో పాటు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో తమకు పట్టాదారు పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు సత్యసాయిబాబా సీఎంతో అన్నారు.