భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ 47 నాటౌట్ (27;6×4, 1×6) టాప్ స్కోరర్. రచిన్ రవీంద్ర 44 (26;2×4, 4×6), టి.సెఫర్ట్ 24(13;5×4) పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2వికెట్లు పడగొట్టగా..శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మొదట్లోనే అభిషేక్ శర్మ (0), సంజు శాంసన్ (6) వికెట్లు కోల్పోయింది. అయితే ఇషాన్ కిషన్ 76 (32; 11×4, 4×6), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82 (37;9×4, 4×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగడంతో ఏకపక్షంగానే మ్యాచ్ సాగింది. ఇషాన్ కిషన్ అవుటయ్యాక సూర్యకుమార్ యాదవ్ జోరు చూపించాడు. శివమ్ దూబే 36 (18;1×4,3×6)లతో చెలరేగడంతో భారత్ కేవలం 15.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.