పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ,రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 25 కోట్ల మంది ఎన్డీఏ పదేళ్ల పాలనలో పేదరికం నుంచి విముక్తి పొందినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి మెడికల్ సర్వీసెస్ అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ లో రైతులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ యాక్ట్ ను తీసుకువచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమనిస్పష్టం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తాందన్నారు. పీఎస్ఐఐ పథకం కింద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. మారిటైం ట్రేడ్ ను మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారత్ పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత డిఫెన్స్ ఎక్స్ పోర్ట్స్ రికారు సాయిలో పెరిగినట్లు వివరించారు.