వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం:- టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు 

Spread the love

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ మేరకు విజయనగరం జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సిద్ధాంతం కోసం పోరాడే మావోయిస్టులు, ఏ సిద్ధాంతం లేని వైసీపీ నేతల కంటే ఎంతో నయమని వ్యాఖ్యానించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లక్ష్యంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు.రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడానికి వస్తున్న కాంట్రాక్టర్లను, పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్వహణకు ముందుకు వస్తున్న సంస్థలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కళా వెంకటరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.