ఏపీలో రూ. 20కే రేషన్ షాపులలో గోధుమ పిండి పంపిణీ 

Spread the love

ఏపీలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి అందించేందుకు జీవో విడుదలైన సంగతి తెలిసిందే. రేషన్‌ దుకాణాల్లో కిలో గోధుమ పిండి రూ.20కు అందించాలనినిర్ణయించారు. జనవరి నుంచి గోధుమ పిండి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇవ్వగా నేటి నుండి పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఇవాళి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ.20కు అందిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో గోధుమ పిండి పంపిణీ విజయవంతమైతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనివలన పేదలకు కిలోకి రూ.40 వరకు ఆదా కానుంది.