ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకున్న అచంచలమైన భక్తిని మరోసారి చాటుకున్నారు.శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఆయన, తన జీవితంలో జరిగిన ఒక భయానక ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.గతంలో ఒక పర్యటనలో తనకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయని, ఆ ప్రమాదం నుంచి తాను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆ క్లిష్ట సమయంలో తనను ఆ అంజన్నే కాపాడారని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిన పవిత్ర స్థలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అందుకే తన రాజకీయ ప్రస్థానంలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా, వాహన పూజలు నిర్వహించినా కొండగట్టు నుంచే ప్రారంభిస్తానని పవన్ వివరించారు. అంజన్నపై ఉన్న అపారమైన నమ్మకంతోనే తాను తన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’కి ఇక్కడే పూజలు చేయించానని గుర్తుచేశారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.సాధ్యమైంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ పర్యటనతో కొండగట్టు పరిసర ప్రాంతాల్లో జనసైనికులు, అభిమానుల సందడి నెలకొంది.