జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం

Spread the love

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ తెలిపింది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న  పిఠాపురం నియోజకవర్గం  నుండి తొలి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. సభ్యత్వం నుండి నాయకత్వం దిశగా నడిపించేలా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు.  పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరూ “ఉద్యమి”. సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పుడే మీ స్థానిక “సాధక్” (క్రియా వాలంటీర్) ను సంప్రదించి  “ఉద్యమి”  సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *