అదరగొడుతున్న ‘టాక్సిక్’ టీజర్ 

Spread the love

కె.జి.ఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. నదియా పాత్రలో కియారా, ఎలిజిబెత్ గా హ్యూమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకా పాత్రలో తారా సుతారియా, మెలిసాగా రుక్మిణీ వసంత్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీజర్‌లో యశ్ మోస్ట్ వయలెంట్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించిఅదరగొట్టాడు. ‘విరోధం పెట్టుకొని బతకలేవు… పట్టుదల వదిలేయ్’, ‘నేను నో చెప్పాను అంటే నో అంతే’ లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌ మూవీపై మరింత ఆసక్తిని పెంచేశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *