మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

సమాజం బాగుండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నేడు సీఎం ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యే నజీర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.నాడు 2018లో మాతా శిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు మళ్ళీ నేడు తానే పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి.చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని, 1981లోనే జింకానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద సహాయం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారని కొనియాడారు. చైతన్యం పెరిగింది. చాలా మంది సమాజం కోసం ముందుకు వస్తున్నారని అన్నారు. చదువు అనేది ‘గేమ్ ఛేంజర్’ అని అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారన్నారు. భారత రత్నకు మారుపేరుగా అబ్దుల్ కలాం నిలిచారని కొనియాడారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేయాలని పీ 4 కార్యక్రమం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.