తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

Spread the love

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.  ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ తమ మొబైల్‌లో My TDP యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ టీడీపీ బలం, బలగం కార్యకర్తలని పేర్కొన్నారు.  పార్టీ అంటే కమిట్ మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ. చేసిన పనులు చెప్పుకోవాలి. పార్టీ  ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని దిశానిర్దేశం చేశారు.