పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ….ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. . మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు పెట్టాం. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశాం. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటు చేశాం. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ… అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలంటూ చంద్రబాబు పేర్కొన్నారు.