గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

Spread the love

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుండి జులై 7వరకు కుంభమేళాను తలపించేవిధంగా నిర్వహించాలని సీఎం సూచించారు. దీనికి తగినట్లు అధికారులు రెడీ కావాలని పేర్కొన్నారు. ఆదేశించారు. ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇక వెంటనే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. దేశ, విదేశాల నుంచి 10 కోట్ల మంది పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు వసతులు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక జిల్లాల్లో 212 కి.మీ. మేర గోదావరి ప్రవహిస్తున్నందున.. పెద్దఎత్తున పుష్కరస్నానాలకు ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆ ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోనూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతమున్న 234 ఘాట్లతో పాటు, కొత్తగా మరో 139 ఘాట్లు కలిపి మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవునా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజమహేంద్రవరంలో మోడల్ ఘాట్ నిర్మించి  దాని డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్లు నిర్మించాలి అని సీఎం పేర్కొన్నారు.