ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సైబర్ సెక్యూరిటీ, మరియు క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో నైపుణ్యం పెంచేందుకు IBM సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 3 నుండి 5 ఏళ్లలో, మన అభ్యర్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలను పెంపొందించుకుని, రాష్ట్రంలోని ఎమర్జింగ్ టెక్ వర్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేస్తారన్నారు. న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా.. IBM EMEA & గ్రోత్ మార్కెట్స్ SVP & చైర్ పర్సన్ శ్రీమతి అనా పౌలా, IBM ఇండియా & సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, IBM రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ & CTO డాక్టర్ అమిత్ సింఘీ మరియు ప్రభుత్వ & రెగ్యులేటరీ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీల సమక్షంలో ఈ రోజు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు.