చేనేత కార్మికుల నిబద్ధత ప్రశంసనీయం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Spread the love

శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి అగస్తేశ్వర చెనేత సహకార సంఘాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా  చేనేత కార్మికులతో కొంత సమయం గడిపారు. తరతరాలుగా సంప్రదాయ ఖాదీ నెయ్యడం కొనసాగిస్తూ వస్తున్న వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. 

వారితో కలిసి పనిచేస్తూ, సమస్యలను తెలుసుకొని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం  చంద్రబాబు నాయకత్వంలో, సంప్రదాయ పరిశ్రమలను బలోపేతం చేయడంలో మరియు గ్రామీణ స్థాయిలో కళాకారులు, కార్మికులకు సాధికారత కల్పించడంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుకు అనుగుణంగా,మనం కూడా ఇటువంటి గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి స్థానిక సంప్రదాయ ఉత్పత్తులను ఉపయోగించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.