‘పెద్ది’ ‘చికిరి చికిరి’ సాంగ్ మరో రికార్డ్ 

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది  విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, పాట రిలీజ్‌కు ముందే భారీ హైప్ ఏర్పడింది. ఆ అంచనాలను మించి ఇప్పుడు ‘చికిరి చికిరి’ నిజంగానే రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పాన్-ఇండియా సంచలనంగా  మారింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ స్థాయిలో మ్యూజిక్ చార్ట్స్‌ను దుమ్ముదులిపేసింది.  డిజిటల్ స్పేస్‌లో కూడా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది ఈ సాంగ్. సోషల్ మీడియాను ఈ సాంగ్ ఎంతలా ఊపేసిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇప్పటికే 3 లక్షలకుపైగా రీల్స్ ఈ పాటపై క్రియేట్ కావడం ఆ క్రేజ్‌కు నిదర్శనం.ఇక యూట్యూబ్ షార్ట్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ కనబడుతోంది. ఏకంగా 8.7 లక్షలకు పైగా షార్ట్స్ వీడియోలు ఈ పాటపై అప్లోడ్ కావడం అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఈ పాటకు 2 మిలియన్లకు పైగా లైక్స్ రావడం మరో విశేషం. ఇది కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు… ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత సెలబ్రేటెడ్ సింగిల్స్‌లో ఒకటిగా ‘చికిరి చికిరి’ నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ పాట సక్సెస్‌తో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో, రామ్ చరణ్ కనిపించబోయే ఇంటెన్స్ పాత్ర, బుచ్చిబాబు ఎమోషనల్ నెరేషన్, ఏఆర్ రెహమాన్ సంగీత మాయ… ఇవన్నీ కలిస్తే ‘పెద్ది’ కేవలం ఒక సినిమా కాదు, మెగా ఫాన్స్ కి ఒక సెలబ్రేషన్ అని చెప్పాలి! ఫస్ట్ సింగిల్‌తోనే ఈ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘పెద్ది’, రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే మిగతా అప్డేట్స్‌తో ఇంకా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.