ప్రారంభమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు

Spread the love

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక సాయంత్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరు కానున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి. హెచ్. మానవేంద్రనాథాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు.