రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పులి కలకలం కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారు జామున రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపింది. రైతు పంతం సత్యనారాయణ ఆవు పై ఈ రోజు తెల్లవారుజామున దాడి చేసింది. నిన్న నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకుని పుణ్యక్షేత్రం గ్రామం వైపు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి నామవరం వద్ద బైక్ పై వెళ్తున్న వారికి కనిపించి పామాయిల్ తోటలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.పుణ్యక్షేత్రం గ్రామానికి చేరుకుని ప్రజలంతా హై అలర్ట్ ఉండాలని ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ సూచించారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పులికి మత్తు ఇచ్చేందుకు ప్రత్యేక బృందం గన్ లను సిద్ధం చేసింది. ఇప్పటికే పెద్ద పులిని బంధించేందుకు ఢిల్లీలోని నేషనల్ టైగర్ అథారిటీ సహా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ పెద్దపులి ఇప్పటికైనా సక్సెస్ అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.