కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే గారు ఈరోజు విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం పలికి, అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.