దైవ కార్యక్రమాలకు, సేవా కార్యకలాపాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు.ఈరోజు సూళ్లూరుపేటలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని వారు దర్శించుకున్నారు.ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహాయంగా 6 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసి, దానికి సంబంధించిన చెక్కును ఆలయ సహాయ కార్యదర్శి ప్రసన్న లక్ష్మికి అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా నెల్లూరు జిల్లా , కోవూరు నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వేమిరెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బెజవాడ వంశీరెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, జనసేన నాయకులు గుడి హరిరెడ్డి మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వేమిరెడ్డి దంపతుల సేవా దృక్పథంపై భక్తులు మరియు స్థానిక నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.