ఆమె నా కొడుక్కి బెస్ట్ సోల్ మేట్..తరుణ్ భాస్కర్ పెళ్లిపై తల్లి అఫీషియల్ అనౌన్స్మెంట్!

పెళ్లిచూపులు , ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత కీడా కోలా లాంటి సినిమాలతో డైరెక్షన్ మాత్రమే కాదు.. తనలోని నటుడిని కూడా బయటకు తీసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్ పర్సనల్ లైఫ్ గురించి, ముఖ్యంగా టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బాతో ఆయన రిలేషన్షిప్లో ఉన్నాడంటూ ఇండస్ట్రీలో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అయితే ఇన్నాళ్లూ గుసగుసలుగా ఉన్న ఈ వార్తలకు ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది. అది కూడా స్వయంగా తరుణ్ భాస్కర్ తల్లి, ప్రముఖ నటి గీతా భాస్కర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కొత్త మూవీ నవంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. కొడుకు సక్సెస్ ను చూసి మురిసిపోయిన ఆమె.. అదే సమయంలో తరుణ్ భాస్కర్ పర్సనల్ లైఫ్ గురించి, అతని పార్ట్నర్ ఎవరనే విషయంపై ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. గత రెండేళ్లలో తరుణ్ భాస్కర్ తన కెరీర్ లో, పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడుదొడుకులు చూశాడని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఒకేసారి మీద పడటంతో తరుణ్ ఎంతో స్ట్రగుల్ అయ్యాడని గీతా భాస్కర్ తెలిపారు. సినిమాల పనుల వల్ల ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు. అలా అర్ధరాత్రి, అపరాత్రి కష్టపడుతూ.. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి అతనికి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మరెవరో కాదు.. మనందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా మన ఈషానే అంటూ గీతా భాస్కర్ అసలు సీక్రెట్ ను రివీల్ చేశారు. ఈషా రెబ్బా తరుణ్‌కు కేవలం ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు.. కష్టాల్లో తోడుండే ఒక అద్భుతమైన సోల్‌మేట్ అని ఆమె పబ్లిక్ గా ప్రకటించారు. గత రెండేళ్లుగా తరుణ్ పడిన మెంటల్ టార్చర్ లో ఈషా అతనికి ఒక పిల్లర్ లా సపోర్ట్ గా నిలబడిందని, ఈషా వల్లనే తరుణ్ తన కొత్త మూవీని పూర్తి చేయగలిగాడని కూడా గీతా భాస్కర్ పేర్కొన్నారు. కొడుకు జీవితంలోకి ఈషా రూపంలో ఒక మంచి తోడు దొరికిందని ఒక తల్లిగా ఆమె ఎంతో గర్వంగా, సంతోషంగా ఫీల్ అయ్యారు. నిజానికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని గతంలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒకే కారులో తిరుగుతున్నారని, డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడూ ఆ వార్తలను నేరుగా ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచే, అది కూడా స్వయంగా తల్లి గీతా భాస్కర్ నోటి నుంచే అఫీషియల్ గా ప్రకటన రావడంతో ఈ రూమర్స్‌కు ఇక తెరపడింది.



