ఆ ప్యాంట్ వెనుక ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా? 20 ఏళ్ల నాటి సీక్రెట్ చెప్పిన రేణు దేశాయ్

తెలుగు ఇండస్ట్రీలో స్టైల్ కు ఐకాన్ గా ఒక జెనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన హీరో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . తన మేనరిజం, నడక, హెయిర్ స్టైల్, ముఖ్యంగా కాస్ట్యూమ్స్ లో కూడా పవన్ ఒక ట్రెండ్ సెట్టర్. తొలిప్రేమ, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో పవన్ వేసుకునే కాస్ట్యూమ్స్ అప్పట్లో యూత్ ను ఒక ఊపుఊపేశాయి. 2005లో వచ్చిన ‘బాలు’ సినిమాలో గని క్యారెక్ట్ లో పవన్ యాక్టింగ్, ఇంకా ప్యాంట్, ఆయన స్టైల్ కు అప్పట్లో జనాలు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయారు. ప్రతి కుర్రాడు ఆ ప్యాంట్ కొనుక్కోవడానికి ఎగబడ్డాడు. అయితే కట్ చేస్తే, 20 ఏళ్ల తర్వాత, ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన రేణు దేశాయ్ పవన్ వేసుకున్న ఆ ప్యాంట్ గురించి ఎవ్వరికీ తెలియని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ బయటపెట్టారు. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ఆ ప్యాంట్లు మామూలు షోరూమ్ లో దొరికేవి కావు. అవి ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నిజమైన ఫ్యాబ్రిక్ తో ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ క్లాత్ ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఇది ఈజీగా ఎక్కడపడితే అక్కడ దొరకదు. ఆ ప్యాంట్ ను తయారు చేయించడానికి మేము ముందే వాళ్లకు భారీ అడ్వాన్స్ చెల్లించాం. ఏకంగా మూడు నెలల పాటు వెయిట్ చేసి ఆ ప్యాంట్లను డెలివరీ తీసుకోవాల్సి వచ్చింది అని రేణు దేశాయ్ వివరించారు. ఇటలీకి చెందిన ఒక ప్రముఖ హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ చేతుల మీదుగా అత్యంత ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్యాంట్ ను రేణు దేశాయ్ స్వయంగా డిజైన్ చేయించారు. గని క్యారెక్టర్ లో ఉన్న ఆ రగ్గడ్ నెస్ రావడానికే అంత కష్టపడి ఆ ఫ్యాబ్రిక్ ను వెతికి మరీ పవన్ కు డిజైన్ చేశారు.
ఒక క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా రావడం కోసం 3 నెలలు ప్యాంట్ కోసం వెయిట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ రేణు దేశాయ్ చెప్పిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. అప్పట్లో అలాంటి స్పెషల్ బట్టతో ఆ ప్యాంట్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు మాత్రమే తయారు చేయబడ్డాయట. వాటిలో ఒకటి ఇంగ్లాండ్ కు చెందిన గ్లోబల్ సాకర్ సూపర్ స్టార్ డేవిడ్ బెక్కం కి వెళ్లింది. ఆ తర్వాత ఇంకో ప్యాంట్ పవన్ కళ్యాణ్ బాలు సినిమా కోసం వీళ్లు తీసుకున్నారు. ఈ అరుదైన, క్వాలిటీతో ఉన్న ఆ ఒక్క ప్యాంట్ ధర 20 ఏళ్ల క్రితమే 75,వేలట . ఆ రోజుల్లో ఇంత పెద్ద మొత్తం పెట్టి ఒక సినిమా క్యారెక్టర్ కోసం కేవలం ప్యాంట్ కొనడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఆ సినిమాపై, ఆ పాత్రపై మేకర్స్, హీరో చూపించిన డెడికేషన్ కు నిదర్శనం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ .. ఒక ప్యాంట్ కోసం 75 వేలు అయినా సరే తానే భరిస్తానని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు సున్నితంగా నిరాకరించి, నిర్మాతకు ఎందుకు అంత భారం అని, తన సొంత డబ్బులతోనే ఆ ప్యాంట్ ను రూపొందించుకున్నారని రేణు దేశాయ్ తెలిపారు. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ఆ ప్యాంట్లు, డబుల్ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ అప్పట్లో కాలేజీ కుర్రాళ్లకు పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారాయి. నిజానికి ఆ 75 వేల ఒరిజినల్ ప్యాంట్ స్ఫూర్తితోనే, లోకల్ మార్కెట్లలో అలాంటి ప్యాంట్లు వందల కొద్దీ దొరకడం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఏది వేసుకుంటే అదే ట్రెండ్ అన్నట్లుగా ఆ రోజుల్లో పరిస్థితి ఉండేది. తొలిప్రేమలో డబుల్ షర్ట్స్, ఖుషిలో గ్యాప్ హుడీస్, గుడుంబా శంకర్ లో ప్యాంట్ మీద డబుల్ ప్యాంట్.. ఇలా ప్రతీ సినిమాకూ కాస్ట్యూమ్స్ విషయంలో పవన్ కు యూత్ లో అంత ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈ బాలు ప్యాంట్ గురించి ఈ విషయాలు బయటపెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



