కూటమి వైపే పట్టణ ఓటర్ల మొగ్గు: ఏకపక్షంగా మారిన ఏపీ స్థానిక సంస్థల తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తాజాగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతిపక్ష వైసీపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
మొత్తం 13 మున్సిపల్ కార్పోరేషన్లలో కూటమి కూటమి ఏకంగా 12 కార్పోరేషన్లలో విజయ బావుటా ఎగురవేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అనంతపురం కార్పోరేషన్‌ను మాత్రమే గెలిచింది. రాష్ట్రంలోని మొత్తం 86 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో కూటమి దాదాపు 83 మున్సిపాలిటీలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్సార్సీపీ కేవలం నందికొట్కూరు, బేతంచెర్ల మరియు నాయుడుపేట వంటి 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగలిగింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి టి. గీతాకుమారి భారీ మెజారిటీతో చైర్పర్సన్ గా గెలిచారు.
జనసేన ఈ ఎన్నికల్లో కూడా 100 శాతం స్ట్రైక్ రేటుతో సత్తా చాటింది. కీలకమైన విజయవాడ నగర మేయర్ స్థానంలో జనసేన భారీ విజయం సాధించింది. అలాగే ఏలూరు కార్పొరేషన్ తోపాటు పోటీ చేసిన ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో వందశాతం స్ట్రైక్ రేటు సాధించినట్లయింది. పొత్తులో భాగంగా జనసేన నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో పోటీకి అవకాశం దక్కింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో గెలుపు సాధించి మొత్తం అన్ని చోట్లా విజయఢంకా మోగించింది.
ఈ విజయంతో పట్టణ ఓటర్లంతా కూటమికే జైకొట్టినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి వైపుగా ప్రజలు అడుగులు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలలో కూటమి పట్ల విశ్వసనీయత చెక్కుచెదరలేదనేది స్పష్టమవుతుందని దానికి ఈ విజయాలే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ స్థానిక సమరంలో సాధించిన ఘనవిజయంతో పట్టణ ప్రాంత ఓటర్లందరూ ఏకగ్రీవంగా కూటమి వైపే నిలిచారని స్పష్టమవుతోంది. మౌలిక వసతుల కల్పన, ఆర్థిక పురోగతి మరియు సుపరిపాలన దిశగా ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలలో కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వసనీయత చెక్కుచెదరలేదనడానికి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో అభివృద్ధి సంక్షేమాలను సమతూకంతో ముందుకు తీసుకెళ్లడానికి ఈ తీర్పు కూటమికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావించవచ్చు.



