ఎడారుల్లో అన్ని డ్యామ్‌లు.. భూగర్భంలో మిస్సైల్ సిటీలు! ఇరాన్ రహస్య వ్యూహం ఇదేనా?

శత్రు దేశాల ఇంటెలిజెన్స్ సైతం ఊహించని వ్యూహాన్ని ఇరాన్ (IRAN) అమలు చేసిందని ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయంశంగా మారింది. దేశంలో ఏమాత్రం అవసరం లేని చోట, మారుమూల ఎడారి ప్రాంతాల్లో వందల కొద్దీ ఆనకట్టలను , భారీ నీటి ప్రాజెక్టులను నిర్మించడం ఎవరికైనా వింతగానే అనిపిస్తుంది. కానీ ఈ ఏడాది ఇరాన్‌పై అమెరికా జరిపిన భారీ దాడులతో.. ఆ ఆనకట్టల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
వాస్తవానికి ఇరాన్ భౌగోళిక పరిస్థితులను చూస్తే.. అక్కడ ఏమాత్రం నీటి వనరులు లేని ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఆనకట్టలు , నీటి పంపిణీ పైప్‌లైన్ ప్రాజెక్టులు నిర్మించారు. వీటిని చూస్తే ఎంతటి నిపుణులకైనా అసలు ఏమాత్రం నీరులేని ఇక్కడ ఈ ఆనకట్టలను ఎందుకు నిర్మించారు? దేనికోసం ఇవి అనే సందేహాలు వచ్చేవి. ఇలా సందేహించిన వారిలో జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇరాన్ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ నిమా షోక్రీ కూడా ఒకరు. ఆయన ఇరాన్ మ్యాప్‌ను డీప్ గా స్టడీ చేసినప్పుడు.. దేశవ్యాప్తంగా ఏకంగా 533 డ్యామ్‌లు నిర్మించడాన్ని ఆయన గమనించారు. ఆ ప్రాంతంలో ఇన్ని డ్యామ్‌ల నిర్మాణం అసలు ఈ ప్రాజెక్టులను ఇరాన్ ఎందుకు నిర్మించిందనే దాని వెనుక ఉద్దేశం ఏంటని ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు, అయితే ఈ సంవత్సరం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలై, అమెరికా వరుసగా పలు ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించిన తర్వాత.. దీనికి జవాబు దొరికింది. అమెరికా దాడులు జరిగిన ప్రదేశాలను ఆ శాస్త్రవేత్త మ్యాప్‌లపై గుర్తించి అవాక్కయ్యాడు. ఎందుకంటే, తాను మ్యాప్‌లో డ్యామ్‌లు ఉన్నాయని గుర్తించిన ప్రదేశాలకు అతి సమీపంలోనే అమెరికా వైమానిక దాడులు జరిగాయి .



