కింది స్థాయి నుంచి ప్రపంచ టెక్ రారాజుగా..ఒక్క తప్పుతో పతనం..జెన్సన్ హువాంగ్ రియల్ స్టోరీ!

ఒకప్పుడు స్కూల్లో బాత్రూమ్లు కడిగిన వ్యక్తి ఆ తర్వాత పొట్టకూటి కోసం రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేసిన యువకుడు తన తెలివితేటలతో ఏకంగా ప్రపంచ టెక్నాలజీ రంగంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మెన్ గా ఎదిగాడు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి కీలకమైన ఏఐ చిప్స్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కానీ, ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. జెన్సన్ హువాంగ్ సంపన్న వ్యక్తిగా మారిన తీరు వెనుక ఎంతో కన్నీటి కథ దాగి ఉంది. జెన్సన్ అసలు పేరు జెన్-హ్సున్ హువాంగ్ . ఆయన 1963లో తైవాన్‌లో జన్మించాడు. చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడి విద్యాభ్యాస సమయంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆసియా వాసులు కావడంతో చిన్న వయసులోనే జెన్సన్ను, ఆయన సోదరుడిని అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న ఒక కఠినమైన బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు.
అది సాధారణ పాఠశాల కాదు, సమస్యాత్మక విద్యార్థులు, నేర ప్రవృత్తి ఉన్న కుర్రాళ్ల కోసం నిర్వహించే స్కూల్. అక్కడ జెన్సన్ హువాంగ్ ఇంగ్లీష్ రాక నానా అవస్థలు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి తీవ్రమైన రేసిజం, వేధింపులు ఎదుర్కొన్నాడు. అక్కడ స్కూల్ రూల్స్ ప్రకారం టాయిలెట్లు కూడా ఆయనే శుభ్రం చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ ఆయన చదువుపై ఎక్కడా ఫోకస్ కోల్పోలేదు. కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసిన జెన్సన్.. పాకెట్ మనీ కోసం ఒక రెస్టారెంట్లో ప్లేట్లు కడుగుతూ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ రంగంపై ఉన్న మక్కువతో హార్డ్‌వేర్ వైపు తన కెరీర్‌ను మళ్లించాడు. ఆ అడుగే ప్రపంచ టెక్ చరిత్రను మార్చేసింది.


