ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రాహుల్..తెలంగాణాలో గిగ్ వర్కర్లకు భారీ సంక్షేమ పథకం!

తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఆ పార్టీ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ‘తెలంగాణ గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాన్ని’ అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని శిల్పారామం నుండి హైటెక్ సిటీలోని జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రులు బైక్ ర్యాలీలో కూడా పాల్గొని సందడి చేశారు. ఈ సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా మరియు రూ.10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుంది. ప్రతి డెలివరీ మరియు క్యాబ్ రైడ్ ట్రాన్సాక్షన్ విలువలో 1 శాతం మొత్తాన్ని ఆయా కంపెనీల నుండి వసూలు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'గిగ్ వర్కర్స్ బోర్డు' ద్వారా కార్మికుల సామాజిక భద్రత మరియు పెన్షన్ కోసం నేరుగా వారి ఖాతాల్లో వేస్తారు. గిగ్ వర్కర్లంటేనే వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఒక చోట నుండి మరొక చోటకు తిరగాల్సిన పరిస్థితి. కాబట్టి వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఎండ, వానలలో పనిచేస్తున్నప్పుడు సేదతీరేందుకు వీలుగా హైదరాబాద్ అలాగే మరియు ఇతర పట్టణాల్లో ఫ్రీ వై-ఫై (Wi-Fi) సౌకర్యంతో కూడిన విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేశారు. కొత్త చట్టం ప్రకారం కార్మికులకు తమ పని గంటలు, డెలివరీ వివరాలు మరియు పేమెంట్స్ కు సంబంధించిన పూర్తి డేటాపై పారదర్శకత మరియు హక్కు కల్పించారు. వర్కర్ల పిల్లల ఎడ్యుకేషన్ మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇక ఈ కీలక సంక్షేమ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.



