ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీపై క్లారిటీ.. రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టిన మేకర్స్!

అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ దేవర సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇందులో 'లూగర్' అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, కథానాయికగా రుక్మిణి వసంత్, బిజు మీనన్ , అశుతోష్ రాణా వంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 11, 2027న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మార్పులు జరుగుతున్నాయని హారిక హాసిని బ్యానర్ నుంచి త్రివిక్రమ్ పక్కకు వెళ్లిపోయారని గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మూవీ టీమ్ వీటిని తిప్పికొడుతూ హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ త్రివిక్రమ్ అలాగే నిర్మాతలు రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ లు ఒకేచోట ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో ఈ సినిమాపై వస్తున్న వదంతులన్నింటిని పక్కకు తోసేసినట్లయింది. ఇది ‘వార్ ఆఫ్ గాడ్’ గా పేరొందిన సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు త్రివిక్రమ్ ఇటీవలే తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఇది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ నిరాధారమైన వార్తలకు చిత్రబృందం ఒకే ఒక్క ఫోటోతో గట్టి సమాధానం ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి. కథాంశం నుండి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి విషయంలోనూ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుండటంతో, విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే సత్తా ఉన్న ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది.



