జైలర్ 2 ఓటీటీలోనూ అదే వెర్షన్.. అదనపు సీన్లపై ఫ్యాన్స్‌కు నిరాశ!

సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్ 2 ఓటీటీ లోకి వచ్చేసింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్ సినిమా ఈ ఏడాది థియేటర్లలో ఏ రేంజ్లో రచ్చ రేపిందో మనందరికీ తెలిసిందే. భారీ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు డైరెక్టర్ నెల్సన్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఏమయ్యా నెల్సన్.. మళ్లీ మోసం చేశావా? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. రజనీ నటన, స్వాగ్, అనిరుధ్ మ్యూజిక్, నెల్సన్ డైరెక్షన్ అలాగే ఈ సీక్వెల్లో నెల్సన్ ప్లాన్ చేసిన క్యామియోలు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒకవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, వీరికి తోడుగా ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్ క్యామియో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను తీసుకొచ్చిపెట్టింది. వేరువేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ అంతా రజనీకాంత్‌కు సపోర్ట్‌గా రావడం థియేట్రికల్ ఆడియన్స్‌కు ఒక పండుగలా అనిపించింది. వీటన్నింటి కలయిక వల్లే జైలర్ 2 ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కు చేరుకుంది.
థియేటర్లో ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత, సహజంగానే ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. దానికి ఒక ప్రధాన కారణం ఉంది. జైలర్ 2 థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమా నుంచి పలు కీలక సన్నివేశాలను నెల్సన్ తొలగించాడంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన కొన్ని ఇంటెన్స్ సీన్స్, అలాగే కోలీవుడ్ స్టార్ క్యూట్ యాక్టర్ సంతానం నటించిన కొన్ని ముఖ్యమైన కామెడీ సీన్లను ఎడిటింగ్‌లో లేపేశారు. దీనిపై రిలీజ్ సమయంలోనే భారీ వివాదాలు, విమర్శలు కూడా తలెత్తాయి. అప్పట్లో మేకర్స్ ఒక క్లారిటీ ఇస్తూ.. థియేటర్లో రన్ టైమ్ కంట్రోల్ చేయడానికి ఆ సన్నివేశాలను పక్కన పెట్టామని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. థియేటర్లో కుదరకపోయినా.. సినిమా ఓటీటీలోకి వచ్చేటప్పుడు ఆ డిలీటెడ్ సీన్స్ అన్నీ కలిపి అన్‌కట్ లేదా ఎక్స్టెండెడ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు.
అయితే సినిమా ఓటీటీలోకి వచ్చాక ప్లే చేసి చూసిన ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగిపోయింది. ఓటీటీలో విడుదలైన జైలర్ 2 వెర్షన్‌ను పరిశీలిస్తే.. థియేటర్లలో ఏ వెర్షన్ అయితే వేశారో, సేమ్ టు సేమ్ అదే వెర్షన్‌ను ఓటీటీలోనూ అప్లోడ్ చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం ఒక్క నిమిషం అదనపు ఫుటేజ్ కూడా జతచేయలేదు. ఎవరి సీన్స్ అయితే మిస్సయ్యాయి అని ఫ్యాన్స్ గొడవ చేశారో, ఆ మోహన్‌లాల్, సంతానంలకు సంబంధించిన తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్లో కూడా యాడ్ చేయకపోవడం విశేషం. దీంతో ఆయా స్టార్ హీరోల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సినిమాకు మరింత హైప్ తెచ్చే ఆ సీన్లను, కనీసం థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో అయినా చూడొచ్చని ఆశించిన వారికి మేకర్స్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ రాలేదు. ఇక ఫ్యాన్స్ బాధ పక్కనపెడితే.. థియేటర్లో సినిమా మిస్ అయ్యి, నేరుగా ఓటీటీలో జైలర్ 2 చూసిన కొత్త ఆడియన్స్ ఫీలింగ్ పూర్తి భిన్నంగా ఉంది. థియేటర్లో జైలర్ 2 చూసినవారు ఆ సౌండ్ సిస్టమ్‌కు, అనిరుధ్ మ్యూజిక్కు ఒకరకమైన హైప్ తెచ్చుకున్నారు. కానీ ఇంట్లో టీవీల్లో, మొబైల్స్‌లో చూస్తున్న ఓటీటీ ఆడియన్స్‌కు ఆ రేంజ్ హైప్ రావడం లేదు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓటీటీ మ్యాచ్ చేయలేకపోతోంది. ఓటీటీలో కొత్తగా జైలర్ 2 చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఎలారా ఇంత హైప్ అయ్యారు ఈ సినిమాకి? కథలో ఏమీ లేదు కదా, కేవలం బీజీఎమ్ వినడానికే వందల కోట్లు ఇచ్చారా? అని ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం ఎలివేషన్ల మీద నడిచే సినిమాలు థియేటర్లలో వర్కౌట్ అయినంత అద్భుతంగా ఓటీటీలో వర్కౌట్ అవ్వవు అనడానికి జైలర్ 2 ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని విశ్లేషకులు చెబుతున్నారు.



