పాత్ర కోసం రష్మిక కఠిన శ్రమ.. మైసా సినిమా నుండి ఆసక్తికర వీడియో పంచుకున్న మూవీ టీమ్!

రష్మిక మంథన తనదైన నటనతో అటు గ్లామర్ రోల్స్ లో అయినా ఇటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనైనా పర్ఫెక్షన్ తో అదరగొడుతూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుని ముందుకు సాగుతోంది. అన్ని ఇండస్ట్రీ లలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. తన సహజమైన నటనతో మరియు ప్రత్యేకమైన ఎనర్జీతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక బలమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. తెరపై కనిపించే తీరు, హావభావాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతూ ఆ పాత్రకు న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత. అందుకే తక్కువ సమయంలోనే భారీ ప్రేక్షకాదరణను నేషనల్ క్రష్ గా ఆమె సొంతం చేసుకున్నారు. గ్లామర్ పాత్రల విషయంలో తనదైన స్టైల్ తో మెప్పించే రష్మిక, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మరింతగా కట్టిపడేస్తారు. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీని మార్చుకుంటూ పాత్రకు తగినట్లుగా వైవిధ్యం కనబరుస్తుంది. భాషా సరిహద్దులను దాటి వివిధ చిత్రసీమలలో నటిస్తూ పాన్-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. భిన్నమైన కథలు మరియు విభిన్నమైన దర్శకుల పనితీరును అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఆమె కెరీర్ కు కలిసి వస్తోంది. ప్రతి కొత్త ప్రాజెక్ట్ తో తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నారు.
ఈ తరం ప్రేక్షకులతో సులభంగా కనెక్ట్ అయ్యే గుణం రష్మికను మరింత ముందుకు దూసుకుపోయేలా చేస్తోంది. తాజాగా ఆమె చేస్తోన్న ‘మైసా’ సినిమాలో కూడా ఒక భిన్నమైన పాత్రలో అలరించనుంది. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా మూవీ నుండి ఒక ఆసక్తికర వీడియోను మూవీ టీమ్ పంచుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను ఎలా మలుచుకుంది. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో నటించేందుకు ఎలా కష్టపడిందో ఇందులో చూపించారు. ఇదివరకు కనిపించని కొత్త రష్మికను ఈ సినిమాలో చూపించినట్లు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రష్మిక అదరగొట్టేసింది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ ఫార్ములా పతాకంపై తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన మూవీ అప్డేట్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.



