రామాయణం సెట్లో సాయి పల్లవి కన్నీళ్లు!

నితేశ్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో సీత... నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అని తెలిసినప్పటి నుంచి, ట్రైలర్ వచ్చే వరకు ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, ట్రోల్స్ వినిపించాయి. బాలీవుడ్ వాళ్లు ఆమె పాత్రకు సూట్ అవుతుందా లేదా అని అనుమానపడ్డారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక విమర్శించిన నోళ్లే ఇప్పుడు ఆమె అభినయానికి నీరాజనాలు పలుకుతున్నాయి. సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే, తన పాత్రకు వస్తున్న ప్రశంసల కంటే.. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన సాయి పల్లవిని పూర్తిగా కదిలించేసింది. ఆ క్షణంలో తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఒక ఎమోషనల్ సీన్ షూటింగ్ పూర్తయ్యాక, ఆమెకు రోజూ భాష నేర్పించే డైలెక్ట్ కోచ్ పరిగెత్తుకుంటూ వచ్చి సాయి పల్లవి కాళ్లు తాకారు. దీని గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. రోజు మొత్తం నాతో ఫోన్లో మాట్లాడుతుండగా, మేకప్ చేసుకుంటుండగా, నార్మల్‌గా తిరుగుతుండగా చూసే నా డైలెక్ట్ కోచ్ అకస్మాత్తుగా నా కాళ్లు మొక్కడంతో నేను షాక్ అయ్యాను. ఆమెకు నేను సాయి పల్లవి అని తెలుసు. కానీ ఎవరైనా రోజూ పూజించే దేవుడి పాత్రను మనం చేస్తుంటే.. ఆ క్షణంలో వాళ్లకు ఎదురుగా ఉన్నది నటుడా, మరెవరా అనేది కనిపించదు. ఆ పాత్ర మీద ఉన్న భక్తి, ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆమె ఏడవకముందే నేను ఏడ్చేశాను. మీరు ఏం చేస్తున్నారు? అని నేను కంగారుగా అడిగాను. నాపై అంత ప్రేమను చూపించడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
పవిత్రమైన, ఆదర్శ మూర్తి అయిన సీత పాత్రలోకి వెళ్లే ముందు సాయి పల్లవి తన డైలీ జీవితంలో చేసే కొన్ని పనులలో చాలా మార్పులు చేసుకున్నారట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి సాయి పల్లవి హాజరయ్యారు. అక్కడ ఆమె తన ప్రిపరేషన్ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. సాధారణంగా ఏ సినిమా చేసినా.. ఈ పాత్రకు నేను నటిగా ఏం ఇవ్వగలను? అని ఆమె ఆలోచిస్తారట. కానీ సీతమ్మ విషయంలో మాత్రం ఈ పాత్ర నుంచి నేను ఏం నేర్చుకోగలను? అని ఆలోచించారట. దర్శకుడు నితేశ్ తివారి విజన్‌కు తగ్గట్లుగా.. ఎక్కువగా తన సొంత ఆలోచనలను జోడించకుండా, రోజూ సీతమ్మను ప్రార్థించి కెమెరా ముందుకు వెళ్లానని సాయి పల్లవి వివరించారు.
ఇక రామాయణం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కురిపిస్తోంది. నవంబర్ 5న విడుదలైన రామాయణ.. కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,000 కోట్ల మార్క్ దాటేసి ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.675 కోట్ల గ్రాస్, రూ.564 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు అఫీషియల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ ప్రకారం 8వ రోజు అన్ని భాషల్లో కలిపి రూ.53.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.358 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.1,033 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కేవలం ఎనిమిది రోజుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా రామాయణ నిలిచింది. దీనికంటే ముందు పుష్ప 2 , ధురందర్ మాత్రమే ముందున్నాయి. ఇదే క్రమంలో బాహుబలి 2 , ఆర్ఆర్ఆర్, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులను అధిగమించింది. భారీ ప్రేక్షకాదరణతో లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకెన్ని భారీ రికార్డులు బద్దలు కొడుతుందో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.



