రామాయణపై నెగెటివిటీ…మ్యూజిక్ లెజెండ్ మాస్ వార్నింగ్!

ఒక భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ సినిమా చుట్టూ ఎంత పాజిటివ్ బజ్ ఉంటుందో, అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణ సినిమా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. నవంబర్ 5న దీపావళి కానుకగా ఈ విజువల్ వండర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆస్కార్ విన్నర్..మ్యూజిక్ లెజెంట్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మంగళ రంగ్ అనే పాటను తాజాగా రిలీజ్ చేసింది. సీతారాముల పవిత్ర బంధాన్ని చూపిస్తూ ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ పరంగా ఈ పాట అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. మ్యూజిక్ పరంగా మాత్రం రెహమాన్ ఊహించని విధంగా నెటిజన్స్ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. సాధారణంగా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండే రెహమాన్.. ఈసారి మాత్రం మౌనం వీడి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఒక పౌరాణిక చిత్రానికి, అందులోనూ రామాయణ లాంటి ఎపిక్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అందులో భారతీయ శాస్త్రీయ సంగీతం, భక్తి భావం ఉట్టిపడేలా వాద్య పరికరాలు ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, మంగళ రంగ్ పాట రిలీజ్ కాగానే ఇది ఒక సూఫీ ఖవ్వాలీ ని పోలి ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. ఒక మైథలాజికల్ సాంగ్ కు ఖవ్వాలీ టచ్ ఇవ్వడం వల్ల ఆ పాటలోని స్వచ్ఛత దెబ్బతిందని వారు వాదిస్తున్నారు. ఇదొక్కటే కాదు, మ్యూజిక్ లవర్స్ రెహమాన్ పై కాపీ ఆరోపణలు కూడా చేస్తున్నారు. గతంలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన చారిత్రక నేపథ్య చిత్రం ఛావా సినిమాలోనూ రెహమాన్ అచ్చం ఇలాంటి బాణీలే వాడారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఇది రెహ్మాన్ గతంలో స్వరాలు సమకూర్చిన ఒక పాత తమిళ చిత్రంలోని పాటను గుర్తు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.



