ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

2027లో డేంజర్ బెల్స్..కోవిడ్ కంటే భయంకరమైన సంక్షోభం రాబోతోందా? చర్చనీయంశంగా మారిన హెచ్చరిక..!

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 07:09 AMకి👁 03 నిమి చదవండి
షేర్ చేయండి:
2027లో డేంజర్ బెల్స్..కోవిడ్ కంటే భయంకరమైన సంక్షోభం రాబోతోందా? చర్చనీయంశంగా మారిన హెచ్చరిక..!
FONT SIZE

ప్రపంచాన్ని ఒక్కసారిగా స్తంభింపజేసిన కరోనా మహమ్మారి రోజులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అంతకంటే భయానకమైన, కోవిడ్ 19 కంటే దారుణమైన పరిస్థితులు వచ్చే ఏడాదే లోనే రాబోతున్నాయన్న ఒక సంచలన హెచ్చరిక యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈసారి ఆ పెను ముప్పు ఏ వైరస్ నుంచో, ప్రకృతి వైపరీత్యం నుంచో రావడం లేదు.. మనిషి తన సొంత మేధస్సుతో సృష్టించుకున్నఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో రాబోతోంది. 2027లో మానవాళికి ఏఐ ఒక పెను ముప్పుగా మారనుందని, పరిస్థితులు కరోనా కంటే దారుణంగా తయారవుతాయని నిపుణుడు నికోలా చేసిన హెచ్చరిక ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ ఏఐ భవిష్యత్తులో ప్రమాదకరం కావచ్చు.. బహుశా ఓ ఇరవై, ముప్పై ఏళ్ల తర్వాత సమస్యలు రావచ్చు అని చాలామంది భావించేవారు. కానీ నిపుణుడు నికోలా మాత్రం మనకు అంత సమయం లేదని, వచ్చే ఏడాది అంటే 2027లోనే మానవాళికి ఏఐ ఒక పెను ముప్పుగా మారనుందని ఆ పరిస్థితులు కోవిడ్ 19 కంటే దారుణంగా ఉంటాయని ఆయన అనడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఏఐ సృష్టించే సంక్షోభం కేవలం ఒక రంగానికే పరిమితం కాదు. అది ఒకేసారి ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగాలను, బ్యాంకింగ్ డిజిటల్ వ్యవస్థలను, సమాచార భద్రతను, చివరికి సామాజిక స్థిరత్వాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే సాంకేతికత మనం ఊహించిన దానికంటే వేగంగా సమాజంలోకి చొచ్చుకుపోతుందో, ఆ మార్పును తట్టుకునే వ్యవస్థలు సిద్ధంగా లేకపోతే వచ్చే షాక్ కోవిడ్ కంటే తీవ్రంగా ఉంటుందన్నది నిపుణుల ఆందోళన.ఇక నికోలా చేసిన రెండో అంచనా మరింత వణుకు పుట్టించేలా ఉంది.. 2030 నాటికి మానవులు ఏఐపై పూర్తి నియంత్రణ కోల్పోతారు అని. 2030 నాటికి ఆ ఏఐ వ్యవస్థలు మనిషి మేధస్సును మించిపోయి, మన కంట్రోల్ చేసే పరిధి దాటిపోతాయని నికోలా హెచ్చరిస్తున్నారు. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలను, యువతను, విద్యార్థులను నేరుగా తాకే మూడో అతిపెద్ద హెచ్చరిక.. నిరుద్యోగం. రాబోయే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందని నికోలా స్పష్టంగా అంచనా వేశారు. ఇవాళ మనం చూస్తున్న ప్రపంచంలో ఇప్పటికే ఐటీ, కస్టమర్ సపోర్ట్, కంటెంట్, డిజైన్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ వంటి అనేక రంగాల్లో పది మంది చేసే పనిని ఒక్క ఏఐ టూల్ నిమిషాల్లో పూర్తి చేస్తోంది. ఇప్పుడు అది కేవలం ప్రారంభం మాత్రమే. వచ్చే పదేళ్లలో ఏఐ మరింత అధునాతనంగా మారి, రోబోటిక్స్‌తో కలిసిపోతే.. కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే కాదు, ఎన్నో సంప్రదాయ ఉపాధి రంగాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. కోట్లాది మందికి ఉద్యోగాలు పోయి, కొత్త ఉద్యోగాలు అదే వేగంతో పుట్టకపోతే.. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతాయి. ఆర్థిక అస్థిరత పెరిగినప్పుడు సమాజంలో అశాంతి తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.సరిగ్గా ఇక్కడే నికోలా సామాన్య ప్రజలకు చేసిన ఆ కీలక సూచనకు అసలైన అర్థం బోధపడుతుంది. ప్రజలు కనీసం రెండు వారాలకు సరిపడా ఆహారం నిల్వ ఉంచుకోవడంతో పాటు, నగదును అందుబాటులో ఉంచుకోవాలి అని ఆయన సూచించారు. ఒకవేళ ఏఐ సంబంధిత సైబర్ దాడుల వల్ల గానీ, సాంకేతిక వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలగడం వల్ల గానీ, లేదా ఆర్థిక అస్థిరత కారణంగా గానీ.. కొన్ని రోజుల పాటు డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, ఆన్‌లైన్ సరఫరా వ్యవస్థలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? అలాంటి అత్యవసర సమయంలో బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉన్నా అవి ఉపయోగపడకపోవచ్చు. చేతిలో ఉన్న నగదు, ఇంట్లో నిల్వ ఉన్న కనీసం రెండు వారాల ఆహార పదార్థాలే ఆ క్లిష్ట సమయంలో కుటుంబాన్ని ఆదుకుంటాయి.

ఈ ముప్పు తప్పదా? మానవాళి చేతులెత్తేయాల్సిందేనా? అంటే కాదంటున్నారు నికోలా . ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఇంకా ఒక స్పష్టమైన మార్గం ఉంది.. అదే ఏఐ అభివృద్ధిపై కఠిన నియంత్రణ . ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీల మధ్య, అగ్రరాజ్యాల మధ్య ఎవరు ముందుగా అత్యంత శక్తివంతమైన ఏఐని తయారు చేస్తారు? అన్న ఒక భయంకరమైన పోటీ నడుస్తోంది. ఆ పోటీలో భద్రతా ప్రమాణాలను, నైతిక విలువలను పక్కనపెట్టి వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఒక అణు ఆయుధాన్ని తయారు చేసేటప్పుడు ఎంత కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు, తనిఖీలు ఉంటాయో.. అంతకుమించిన కఠినమైన చట్టాలు, నియంత్రణలు ఏఐ అభివృద్ధిపై కూడా తక్షణమే విధించాలని నికోలా స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఏఐపై స్పష్టమైన హద్దులు విధించినప్పుడే ఈ పెను ముప్పును నివారించగలమని ఆయన తేల్చిచెప్పారు.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు