కింది స్థాయి నుంచి ప్రపంచ టెక్ రారాజుగా..ఒక్క తప్పుతో పతనం..జెన్సన్ హువాంగ్ రియల్ స్టోరీ!

ఒకప్పుడు స్కూల్లో బాత్రూమ్లు కడిగిన వ్యక్తి ఆ తర్వాత పొట్టకూటి కోసం రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేసిన యువకుడు తన తెలివితేటలతో ఏకంగా ప్రపంచ టెక్నాలజీ రంగంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మెన్ గా ఎదిగాడు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి కీలకమైన ఏఐ చిప్స్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కానీ, ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. జెన్సన్ హువాంగ్ సంపన్న వ్యక్తిగా మారిన తీరు వెనుక ఎంతో కన్నీటి కథ దాగి ఉంది. జెన్సన్ అసలు పేరు జెన్-హ్సున్ హువాంగ్ . ఆయన 1963లో తైవాన్‌లో జన్మించాడు. చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడి విద్యాభ్యాస సమయంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆసియా వాసులు కావడంతో చిన్న వయసులోనే జెన్సన్ను, ఆయన సోదరుడిని అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న ఒక కఠినమైన బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు.
అది సాధారణ పాఠశాల కాదు, సమస్యాత్మక విద్యార్థులు, నేర ప్రవృత్తి ఉన్న కుర్రాళ్ల కోసం నిర్వహించే స్కూల్. అక్కడ జెన్సన్ హువాంగ్ ఇంగ్లీష్ రాక నానా అవస్థలు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి తీవ్రమైన రేసిజం, వేధింపులు ఎదుర్కొన్నాడు. అక్కడ స్కూల్ రూల్స్ ప్రకారం టాయిలెట్లు కూడా ఆయనే శుభ్రం చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ ఆయన చదువుపై ఎక్కడా ఫోకస్ కోల్పోలేదు. కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసిన జెన్సన్.. పాకెట్ మనీ కోసం ఒక రెస్టారెంట్లో ప్లేట్లు కడుగుతూ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ రంగంపై ఉన్న మక్కువతో హార్డ్‌వేర్ వైపు తన కెరీర్‌ను మళ్లించాడు. ఆ అడుగే ప్రపంచ టెక్ చరిత్రను మార్చేసింది.
1993లో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎన్విడియాను స్థాపించాడు. 1999లో ఎన్విడియా ప్రపంచంలోనే తొలి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట్లో ఈ చిప్స్‌ను కేవలం వీడియో గేమ్స్‌లో గ్రాఫిక్స్ నాణ్యతను పెంచేందుకు మాత్రమే వాడేవారు. కానీ జెన్సన్ విజన్ అక్కడితో ఆగలేదు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని ముందే పసిగట్టిన ఆయన.. ఆ చిప్స్‌ను ఏఐకి అనుగుణంగా డెవలప్ చేశాడు. ఈరోజు మనం వాడుతున్న చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీల వెనుక ఉన్నది ఎన్విడియా చిప్సే. దీంతో ఆ కంపెనీ దశ తిరిగింది.
ఎన్విడియా ఎదుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను దాటేసి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా రికార్డు సృష్టించింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద ఏకంగా 160 బిలియన్ డాలర్లకు చేరింది. కానీ ఈ ఎదుగుదలతో పాటు ఆయనకు అమెరికా రాజకీయ వర్గాల్లో వివాదాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా చైనాకు అధునాతన చిప్స్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో జెన్సన్ వాటిని బహిరంగంగా వ్యతిరేకించాడు. ఈ బ్యాన్ వల్ల అమెరికా సెమీకండక్టర్ పరిశ్రమకే నష్టమని వాదించాడు. దీంతో చైనాకు చిప్స్ విక్రయాల విషయంలో ఆయన చూపిస్తున్న సానుభూతిపై అప్పట్లోనే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక కన్నేసి ఉంచాయి. ఒక మనిషి జీవితంలోకి తప్పుడు మార్గంలో వెళ్తే ఎంతటి సామ్రాజ్యమైనా కుప్పకూలుతుందనడానికి జెన్సన్ జీవితమే ఒక ఉదాహరణ. ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ విషయం అమెరికా మీడియాల్లో లీక్ అయింది. చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే యువతితో జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలతో సహా బయటపడింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఆలిస్ హువాంగ్ సాధారణ మహిళ కాదు. ఆమెకు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయని, ఎన్విడియా సీక్రెట్స్ లాగడానికే చైనా ఈ హనీట్రాప్ ప్లే చేసిందని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించినా.. జెన్సన్ హువాంగ్ మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. నవంబర్ 8న ఎన్విడియా ఉద్యోగులకు రాసిన ఒక అంతర్గత లేఖలో.. తన భార్యకు తాను నమ్మకద్రోహం చేశానని జెన్సన్ అంగీకరించాడు. ఆలిస్ హువాంగ్‌తో తనకు లైంగిక సంబంధం ఉన్నట్లు ఆయన స్వయంగా ఒప్పుకుని క్షమాపణలు చెప్పడంతో టెక్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఈఓ స్వయంగా తన తప్పును అంగీకరించడంతో ఎన్విడియా బోర్డు ఆయనపై అంతర్గత విచారణ ప్రారంభించింది. ఈ సంచలన పరిణామాలతో ఎన్వీడియా షేర్లు స్టాక్ మార్కెట్లో దారుణంగా కుప్పకూలాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. చివరికి నవంబర్ 12న జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో పాటు కంపెనీ బోర్డు నుంచి కూడా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. 33 ఏళ్ల పాటు ఆయన నిర్మించిన సామ్రాజ్యం ఒకే ఒక్క హనీట్రాప్‌తో కూలిపోయింది.


