ఈరోజు సెషన్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు కొన్ని కంపెనీలు మెరుగైన క్వార్టర్ ప్రకటించడం వంటివి మార్కెట్ కు కలిసొచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 208.17 పాయింట్ల లాభంతో 84,273.92 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 67.85 పాయింట్లు లాభపడి 25,935.15 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.51గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో టాటా స్టీల్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్.డి.ఎఫ్.సి షేర్లు నష్టపోయాయి.