దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో గత మూడు రోజులుగా కొనసాగిన లాభాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్,ఆటో,మెటల్, ఎఫ్.ఎం.సీ.జీ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 1,236 పాయింట్లు క్షీణించి 82,498 వద్ద ముగిసింది. నిఫ్టీ 365 పాయింట్లు తగ్గి 25,454 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.19గా కొనసాగుతోంది. భౌగోళిక ఉద్రిక్తతలు (Geopolitical Tensions) అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల మార్కును దాటడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. గత మూడు రోజులుగా లాభాల్లో ఉండటంతో, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.