ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చింది. మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో చర్చ జరిగింది. 7 కొత్త సంస్థలకు భూ కేటాయింపులకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర,కందుల దుర్గేష్ ,సంధ్యా రాణి హాజరయ్యారు. బ్యాంకుల సిబ్బంది కొరకు రెసిడెన్షియల్ స్థలం కోసం భూ కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది.భారత వాతావరణ శాఖ కు ఎకరా భూమి కేటాయించారు.ETPR కు 0.74 ఎకరాలు కేటాయించారు.KVB కి 0.4 ఎకరాలు,నాబార్డ్ కి ఎకరా,పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు అర ఎకరా,రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ కు 2 ఎకరాలు కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది.ఇప్పటివరకూ భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే దానిపై సమావేశంలో చర్చించారు.