నష్టాలతో నేటి ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Spread the love

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి సెషన్ ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. దీంతో వరుసగా  మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాల జోరుకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల వైఖరిపై క్లారిటీ కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించడంతో సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్  సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 83,313 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 133 పాయింట్లు తగ్గి 25,642 వద్ద ముగిసింది.  డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.33గా కొనసాగుతోంది. జే.ఎస్.డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, ట్రెంట్, మ్యాక్స్ హెల్త్ కేర్, టాటా స్టీల్ షేర్లు రాణించాయి.