సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తదితరులతో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్తీ మనస్తత్వం, కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించిందని, దేవాలయాల వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేశారని, సుమారు 200కు పైగా దేవాలయాలపై గత ప్రభుత్వంలో దాడులు జరిగాయని, ఆ దాడులు చేస్తే తుంటరి చర్యలంటూ గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, దేవాలయాల్లోని వ్యవస్థలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందనడానికి టీటీడీలోని కల్తీ నెయ్యి వ్యవహరమే ఉదాహరణని అన్నారు.