ఆర్.ఏ.సీ కేటగిరి..బెర్త్ లభించని పక్షంలో టికెట్ ఛార్జీలో కొంత తిరిగి ఇవ్వాలి

Spread the love

రైలు ప్రయాణం కోసం ఆర్.ఏ.సీ కేటగిరిలో బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీలు వసూలు చేయడం సబబు కాదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఆర్.ఏ.సీ లోనే ఉంది బోర్డింగ్ సమయంలో బెర్త్ దొరకని ప్రయాణికులకు ఛార్జీలో కొంతమొత్తం తిరిగి ఇవ్వాలని సూచించింది. దీని కోసం ప్రత్యేక సిస్టమ్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. punctuality and travel time in train operations in indian railways పేరుతో పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్.ఏ.సీ కింద బుక్ చేసుకున్న ప్రయాణికుల నుండి మొత్తం ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరిలో ఉన్న మరో ప్రయాణికులతో బెర్త్ షేర్ చేసుకోవాల్సిఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికులు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు టికెట్ లో కొంత మొత్తాన్ని చెల్లించాలని దీనికి సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది.