వరుసగా మూడో రోజైన నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ బ్యాంకింగ్, మెటల్, ఎఫ్.ఎం.సీ.జీ స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాలలో కొనసాగాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 83,734 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,819 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.68గా కొనసాగుతోంది. టాటా స్టీల్, ITC, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, చివరి గంటలో బ్యాంకింగ్, మెటల్ మరియు FMCG షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వల్ల ఐటీ రంగంలో వస్తున్న మార్పుల పట్ల ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలతో ఆ రంగం షేర్లలో జోరు తగ్గింది.