జగన్ కు ఇప్పుడిచ్చారు-మాకు ఎప్పుడో ఇచ్చారు-జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్..!

పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ కు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, మాకు అలాంటివి ఎప్పుడో ఇచ్చారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. జగన్ తిరుపతిలో అల్లర్లు,మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, ఆయన్ను కొట్టడానికి తాము గుడ్లు కొన్నామని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని తెలిపారు. గులకరాయో,గొడ్డలి వేటు లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూసారన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని తెలిపారు. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం […]

టీటీడీ పని చంద్రబాబు, పవన్ చేస్తారా ? కాకాణి ఫైర్..!

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణలు రావడం దురదృష్టకరమని వైసీపీ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. వెంకటేశ్వర స్వామి మీద, స్వామివారి కైంకార్యాల మీద అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసినట్లు కాకాణి తెలిపారు. వక్రబుద్ధి నుంచి చంద్రబాబు కు మంచి బుద్ధి రావాలని స్వామిని […]

జగన్ క్రైస్తవుడు కాదు నాస్తికుడు-టీడీపీ ఎమ్మెల్యే జీవీ కామెంట్స్..!

జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వల్లే తిరుమలకు చెడ్డ పేరన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం లేకనే జగన్ తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే జగన్ కి రోషమెందుకని ప్రశ్నించారు. తిరుమల సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే అన్నారు. లడ్డు ప్రసాదం కల్తీ పాపం ఊరికే పోదని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన జగన్ ని ఆ దేవుడే శిక్షిస్తాడని జీవీ తెలిపారు. […]

ఏలూరులో వైసీపీ ప్రత్యేక పూజలు-కారణమిదేనట..!

టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని ఆరోపిస్తూ పాప ప్రక్షాళన కోసం ఇవాళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. చంద్రబాబు పాపాలకు పరిహారం అంటూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెబుతున్న వైసీపీ నేత కారుమూరి సునీల్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్

హిందువైతే రెడ్డి.. క్రిస్టియన్ అయితే జగన్-అలిపిరిలో సాధువుల డిమాండ్…!

తిరుమలకు జగన్ పర్యటన రద్దు నేపథ్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద సాధువులు, హిందూ సమాజం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జగన్, నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా, అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తానంటే హిందువులను అగౌరపరిచినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి హిందువు అయితే రెడ్డి అని పెట్టుకోవాలని, క్రిస్టియన్ అయితే జగన్ అని పెట్టుకోవాలని,లేదంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు శ్రీ వెంకటేశ్వర స్వామి […]

వైసీపీ నుంచి తప్పుకోగానే అలా షాకులు ! గుర్తు చేసుకున్న కోటంరెడ్డి ..!

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేషనల్ హైవేపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ పనులు ప్రారంభించానని, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పనులు మొదలయ్యాయని, కానీ వైసీపీ నుంచి తప్పుకున్నాక మాత్రం ఆగిపోయాయని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైనా, తాను వైసీపపీ నుంచి దూరంగా జరిగాక ఈ పనులు ఆగిపోయాయన్నారు. ఈసారి […]

తిరుపతి కార్పోరేషన్ ఆఫీసు శుభ్రం చేసిన అధికారులు-ఎందుకో తెలుసా ?

తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛతాహీ సేవలో భాగంగా అధికారులు చీపుళ్లు చేతబట్టి కార్యాలయాన్ని శుభ్రం చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కమిషనర్ స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు.

త్వరలో ఆ ఎన్నికలు-ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన.. !

గత ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరిగి దాన్ని గాడిన పెట్టేందుకు రైతుల భాగస్వామ్యంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సాగునీటి వ్యవస్థకు పునర్జీవనం కలిగించే విధంగా ఎన్నికలు నిర్వహించడానికి జీవో విడుదల చేసినట్లు రామానాయుడు తెలిపారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

పవన్ కు మద్దతుగా చిన వెంకన్న సన్నిధిలో జనసేన నేత దీక్ష..!

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అపరాధం జరిగిందన్న వార్తల నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఏలూరు జనసేన నేత నారా శేషు తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కు సంఘీభావంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న సన్నిధిలో ఆయన వారం రోజుల దీక్ష చేపట్టారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల […]

వాళ్లు క్రిస్టియన్లేగా-డిక్లరేషన్ ఇవ్వు..!పవన్ కు మాజీ డిప్యూటీ సీఎం డిమాండ్..!

తన భార్య పిల్లలు క్రిస్టియన్లని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ప్రభుత్వ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర ముగించుకుని తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ లో సంతకం చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.కొత్తగా డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని అడగడంలో ఆంతర్యం […]