జగన్ అప్పుడు మాంసం కూడా ముట్టరు-చెవిరెడ్డి సంచలనం..!
తిరుమల టూర్ రద్దు విషయంలో వైసీపీ అధినేత జగన్ పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో జగన్ 3680 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. ఆయన తిరుమలకు వచ్చే రోజు మాంసం కూడా ముట్టరని తెలిపారు. తండ్రి రాజశేఖరరెడ్డి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రధానం చేశారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి భావన ఎక్కువన్నారు. ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని, గోవులకు […]
జగన్ అందుకే వెళ్లలేదు- ఇంట్లో వాళ్లే మాట వినరు -బుద్ధా వెంకన్న షాకింగ్ ..!
తిరుమలను జగన్ స్వార్ద రాజకీయాల కోసం వాడుకోవడం నీచమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తిరుమల వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదనడం హాస్యాస్పదం అన్నారు. మనం అనుకుంటే కాదు, స్వామి అనుగ్రహిస్తేనే తిరుమల వెళ్లగలమన్నారు. వెంకన్న అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని బుద్ధా ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకన్నారు. నీ ఇంట్లో నీ భార్యని […]
జనసైనికులపై రెచ్చిపోయిన పేర్ని కిట్టు..! ఇల్లు ముట్టడికి వస్తారా..
బందరులో తన ఇంటి ముట్టడికి వచ్చిన జనసైనికులపై మాజీ మంత్రి పేర్నినాని తనయుడు కిట్టు రెచ్చిపోయారు. తన ఇంటి ముట్టడికి ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. జనసేన క్యాడర్ పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలకు దిగడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మీకు 40 మంది ఉంటే మాకు 400 మంది ఉన్నారంటూ నిరసనకు వచ్చిన వారిని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్ని సహించబోమన్నారు.
సింహాద్రి అప్పన్న సేవలో లోకేష్..!
విశాఖలోని సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
స్వచ్ఛతపై అవగాహనకు తిరుపతిలో 3కే రన్-తరలివచ్చిన జనం..!
తిరుపతి నగర పౌరులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కార్పోరేషన్ ఇవాళ సిటీలో 3కే రన్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛత-హి-సేవలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. నగరంలోని వివేకానంద సర్కిల్ నుంచి ఎస్వీయూ ఆడిటోరియం వరకు ఈ రన్ జరిగింది. ఇందులో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక […]
వైఎస్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పిన నెల్లూరు కాంగ్రెస్ నేత..!
తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినందుకు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొంతునై రాష్ట్రంలో జరిగే అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండకడతానన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో క్లుప్తంగా ప్రతి ఒక్కరికి వివరిస్తాను అన్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ప్రతి గడప […]
డిక్లరేషన్ మర్చిపోకండి జగన్- టీడీపీ ఎమ్మెల్యే చెడుగుడు..!
దొంగ యాత్రలతో చేసిన జగన్ చేసిన పాపాలు పోవని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పాపాలన్నీ చేసి యాత్రలు, దర్శనాలు చేసుకుంటే ప్రాయశ్చితం అయిపోతాయా అని ప్రశ్నించారు. జగన్ చేసింది మాములు పాపం కాదు.. కలియుగ వైకుంఠస్వామికే ద్రోహం చేశారన్నారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారని జీవీ విమర్శించారు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికులు, అన్యమతస్తులు, దొంగల చేతుల్లో పాలకమండలిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి చేయాల్సింది యాత్రలు కాదు, […]
నూర్ బాషాలకు అండగా ఆ పల్నాడు ఎమ్మెల్యే.. ! బాబు, పవన్ కు పాలాభిషేకాలు..
రాష్ట్రంలో నూర్ బాషాలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆహ్వానించారు.సీఎం చంద్రబాబు నూర్ బాషాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాచర్ల నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి , చంద్రబాబు, పవన్ ఫొటోలకు ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాలాభిషేకం చేశారు, మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు […]
ఏలూరు బస్టాండ్ శుభ్రం చేసిన జడ్పీ ఛైర్ పర్సన్-కారణమిదే..!
ఏలూరు కొత్త బస్ స్టాండ్, జిల్లా పరిషత్ ఆవరణలో “స్వచ్ఛత హి సేవ 2024” కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని బస్ స్టాండ్ పరిసరాలని శుభ్రపరిచారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతిజ్ఞ […]
పవన్ కు అండగా హిందూ సమాజం..! తిరుమలలో మొక్కులు..
సనాతన బోర్డు ఏర్పాటు కోసం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద హిందు సమాజం ప్రతినిధులు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం హర్షణీయమని వారు తెలిపారు. ముస్లింలకు వక్స్ బోర్డ్ ఉన్నట్లే హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన బోర్డు ఏర్పాటుతో హిందు దేవాలయాలు, ఆస్తుల పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. హిందు […]