ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక చావ్లా తాజాగా ప్రశంసలు గుప్పించారు. ఒకప్పుడు వెండితెరపై తనతో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, నేడు ప్రజాసేవనే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం నిజంగా గర్వకారణమని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
‘ఖుషి’ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ భూమిక మాట్లాడారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా, మనిషిగా కూడా ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడని చెప్పారు. తనలోని నిజాయితీ, స్పష్టమైన ఆలోచనలు, ఇతరుల పట్ల గౌరవం అప్పుడే కనిపించేవని, అదే లక్షణాలు ఇప్పుడు ఆయనను రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాలకు చేరువ చేశాయని అన్నారు.
సినిమాల్లో స్టార్‌గా ఉన్నప్పటికీ, ఆ కంఫర్ట్ జోన్‌ను వదిలి ప్రజల కోసం పోరాడే మార్గాన్ని ఎంచుకోవడం సాధారణ విషయం కాదని భూమిక పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, విమర్శలు, అవరోధాలను ఎదుర్కొంటూ కూడా పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగడం నిజంగా ప్రశంసనీయం అని ఆమె అభిప్రాయపడ్డారు. నటుడిగా అభిమానుల ప్రేమ పొందిన ఆయన, ఇప్పుడు నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ఆయన పట్టుదలకే నిదర్శనమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని భూమిక అన్నారు. ముఖ్యంగా యువతకు, కళారంగం నుంచి రాజకీయాల వరకు ఏ రంగమైనా నిజాయితీగా కష్టపడితే ఉన్నత స్థాయికి చేరవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ స్థాయిలో కూడా ఆయనలోని సాధారణత, సేవాభావం మారలేదని ఆమె కొనియాడారు.
ప్రస్తుతం భూమిక గుణ శేఖర్ డైరెక్షన్ లో త్వరలో విడుదల కానున్న యుఫొరియా ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ చుస్తే, అసలు టీనెజర్స్ ఎలా చెడిపోతున్నారో, డ్రగ్స్ కి ఎలా బానిసలూ అవుతున్నారో చూపిస్తుంది… ఎప్పుడు తీయని కొత్త కాన్సెప్ట్ తో నిజ జీవితం కి దెగ్గరగా ఉన్న GENZ కాన్సెప్ట్ తో గుణశేఖర్ కొత్త ప్రయోగం చేసారు… ఈ సినిమా వచ్చే నెల 6th న రిలీజ్ అవ్వబోతుంది!