పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే అభిమానుల్లో ఆనందం ఇంకా ఎక్సపెక్టషన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్ల వద్ద కనిపించే సందడి, బ్యానర్లు, కట్‌అవుట్లు, వేడుకల వాతావరణం అన్ని కలిసి ఒక పండుగలా మారిపోతాయి. బాక్సాఫీస్ వద్ద మరే హీరో సినిమా నడుస్తున్నా, పవన్ ఎంట్రీ ఇచ్చే క్షణం నుంచి ఆ వాతావరణం పూర్తిగా మారిపోవడం ఆయనకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్‌కు నిదర్శనం.
గతేడాది OG సినిమా హిట్ అవ్వడం తో అభిమానులు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు అందరి చూపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం కి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. గతంలో పవన్–హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పవన్ అభిమానులకు ఇచ్చిన ఆనందం ఇప్పటికీ గుర్తుండేలా ఉంది. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే స్థాయి మ్యాజిక్‌ను మళ్లీ సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. హీరోయిన్‌లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న భారీ స్థాయిలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ విజయానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆ చిత్రంలోని పాటలు థియేటర్లలో అభిమానులను డాన్స్ చేసేలా చేసాయి. పవన్ వేసిన మాస్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా పవన్‌తో మంచి డాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట ఈ అంచనాలను నిజం చేసేలా కనిపించింది. ఆ పాటలో పవన్ చూపించిన ఎనర్జీ, స్టెప్స్, మాస్ అటిట్యూడ్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.ఇప్పుడు రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్ కూడా రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ పాటలో పవన్ ఎలివేషన్స్ పీక్ స్థాయిలో ఉంటాయని, థియేటర్లలో అభిమానులు భారీగా స్పందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. “ఏ తరమైనా నీ తరమే… మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే…” అనే భావోద్వేగ లిరిక్స్ పవన్‌కు అభిమానులు కలిగిన అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆయన మాస్ ఇమేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.