విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’. అనౌన్సమెంట్ నుంచే అందరిలో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ వంటి నటుల నటన వారు పలికించిన హావభావాలతో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
వీటితో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ట్రెండ్ కు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేసింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఎటువంటి మూవీనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రతీ కథకు మాటలు అవసరం లేదు. కొన్నిటిని కేవలం అనుభూతి చెందాలి.ఈసారి, ఈ తెర మాట్లాడదు. నిన్ను మౌనంగా వినేలా చేస్తుంది. అంటూ వస్తున్న ఈ మూవీ ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది.