విజయ్ బర్త్ డే సందర్భంగా ‘రౌడీ జనార్ధన’ నుండి ఆసక్తికర పోస్టర్

Spread the love

ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలున్న సినిమాలతో డిఫెరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు  విజయ్ దేవరకొండ.  ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రం ‘రౌడీ జనార్దన్’ నుండి నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదలైంది. ఇప్పటివరకూ విజయ్ యాంగ్రీ లుక్ లో ఉన్న ఫొటోలు పంచుకున్న మూవీ టీమ్ ఇప్పుడైతే ఒక వైవిధ్యమైన పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. A man who fights the world…but surrenders only to love అంటే ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అని పేర్కొంటూ తమ హీరోకు  విషెస్ తెలిపింది. ఇందులో విజయ్ కి జోడీగా కీర్తి సురేశ్ కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ కూడా చాలా వినూత్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. 80వ దశకం నేపథ్యంలోని ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందు ఉంచేందుకు అద్భుతంగా పునఃసృష్టించినట్లు తెలుస్తోంది. మొత్తంగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ తో అలరించారు. ఇక రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘రణబాలి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మంథన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తిని పెంచేశాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *