ది కేరళ స్టోరీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిందే. ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ రానుంది. ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా తీర్చిదిద్దిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న రానుంది. తాజాగా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. నేను కేరళకు చెందిన సురేఖా నాయర్. ఐఏఎస్ అధికారిణిగా ఉద్యోగం సాధించి నా దేశానికి ఏదైనా చేయాలనుకున్నా. నా పేరు నేహా సంత్. నేను ఒలింపిక్స్లో భారత జెండాను రెపరెపలాడించాలనుకున్నా. నేను రాజస్థాన్ కు చెందిన దివ్యపలివాల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలనుకున్నా అంటూ ఓ ముగ్గురు అమ్మాయిలు తమ డ్రీమ్ లైఫ్ గురించి చెప్తున్నారు. మరి వారు అనుకున్నట్లే జీవితం సాగిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమా చూడాల్సిందే. కామాఖ్య నారాయణ్ సింగ్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. విపుల్ అమృతాలాల్ షా నిర్మాత. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఇకపై సహించము… పోరాడతాం’ అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.