విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

Spread the love

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను కేంద్రమంత్రి జితేందర్ సింగ్ ప్రారంభించారు.  సౌత్ ఆసియాకు ప్రధాన ద్వారంగా ఏపీని అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నట్లు తెలిపారు. సముద్ర  వాణిజ్యానికి కేంద్ర బిందువుగా విశాఖ నిలుస్తుందన్నారు. 4 ఎకరాల్లో రూ.32 కోట్లతో నిర్మించిన ఓషనోగ్రఫీ రీజినల్ సెంటర్ శాస్త్రీయ పరిశోధనల ద్వారా దేశాభివృద్ధికి కీలక సేవలందిస్తుందన్నారు. దీనిని ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కారు కేవలం ఏడాదిలో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిందన్నారు. సముద్ర వనరుల అన్వేషణలో దేశం మరో ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కళింగపట్నం గ్లోబల్ స్ట్రీట్ ట్రేడ్ సెంటర్ ద్వారా దక్షిణ, తూర్పు ఆసియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం కానున్నాయని తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఏపీని “సన్‌రైజ్ కోస్టల్ స్టేట్” గా తీర్చిదిద్దడమే మా సంకల్పమని  పరిశోధనలతో పాటు మత్స్యకార సోదరుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది. పరిశోధనలు, సాంకేతికత మరియు మౌలిక వసతులతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం త్వరలోనే ప్రధాన పారిశ్రామిక కారిడార్‌గా రూపుదిద్దుకోనుందని మంత్రి అనిత పేర్కొన్నారు.