ఈ ఏడాది సంక్రాంతి ఫుల్ జోష్ తో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నారు ఆయన. దీంతో ఇక రానున్న తదుపరి సినిమా ‘విశ్వంభర’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా అత్యద్భుతమైన ఎంటర్టైనర్ గా వస్తోంది. వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. కాగా జులై తొలివారంలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై చిరు కూడా ఇటీవల జరిగిన మీడియా భేటీలో స్పందించారు. ఇది జులై 9న తెరపైకి వచ్చే అవకాశముందని.. దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ తానింకా చూడలేదని తెలియజేశారు. మరి ఇది చిరంజీవి చెప్పిన తేదీ నాటికి అన్ని పనుల్ని పూర్తి చేసుకుని తెరపైకి వస్తుందా? లేదా? చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.