ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వేళా ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. ఆర్థిక సంక్షోభంతో ఇరాన్ సతమతమవుతుండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలకు దిగుతున్నారు. భద్రతాదళాలు వారిపై దాడులు చేయడంతో 500 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. నిరసనకారుల ఆందోళనతో ఇరాన్ అట్టుడుకుతున్న నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని టెహ్రాన్ లో విదేశీ దౌత్యవేత్తల సమావేశంలో మాట్లాడారు. తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఆరోపణలు చేశారు. ఆందోళనకారుల నిరసనలతో తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్ కు ఒక వంక దొరికిందని దుయ్యబట్టారు.